KNR: గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా వద్ద కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారిపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నాగి శేఖర్, ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యుత్ సరఫరాపై రైతుల ధర్నా


