PLD: ఉమ్మడి గుంటూరు రూరల్ జిల్లాకు కేటాయించిన 196 మంది నూతన కానిస్టేబుళ్లు పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. వారితో సమావేశమైన ఎస్పీ జగదీష్ ఆదహళ్లి క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ చట్ట నిబంధనలు పాటించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి: ఎస్పీ


