ATP: ఒంగోలు, కడపలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకుని జిల్లాకు ఎంపికైన 279 మంది నూతన కానిస్టేబుళ్లకు అనంతపురం ఎస్పీ పి.జగదీష్ దిశానిర్దేశం చేశారు. క్రమశిక్షణతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. మరో 45 రోజులపాటు క్షేత్రస్థాయి విధులు, వివిధ పోలీసింగ్ అంశాలపై అనంతపురం DTCలో ప్రత్యేక ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు 279 మంది నూతన కానిస్టేబుళ్లు రాక


