హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్లు దుకాణానికి తాళం

KMR: నస్రుల్లాబాద్ మండలం మిర్జాపూర్‌లో కల్లు ధర పెంచడంపై ఆగ్రహించిన గ్రామస్థులు బుధవారం దుకాణానికి తాళం వేశారు. సీసా ధరను రూ.10 నుంచి రూ.15కు పెంచడంపై నిరసన వ్యక్తం చేసి, పాత ధరకే విక్రయించాలని డిమాండ్ చేశారు. బీర్కూర్ మండలంలోని మరో గ్రామంలోనూ ఇదే విషయంపై గ్రామస్థులు ఆందోళన చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.