హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం దృష్టికి సమస్యలను తీసుకెళ్తా: ఎమ్మెల్యే

సత్యసాయి: మడకశిర, హిందూపురం నియోజకవర్గాల్లో తాగు, సాగు నీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామితో కలసి అధికారులతో సమీక్షించిన ఆయన.. నీటి సమస్యలపై త్వరితగతిన స్పందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యలను తీసుకెళ్తానని పేర్కొన్నారు.