హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్యాడ్మింటన్ అరేనాను ప్రారంభించిన ఎమ్మెల్యేలు..!

KMM: అశ్వారావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన "ఉజ్వల బ్యాడ్మింటన్ అరేనా"ను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో ఉభయ నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.