హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళలకు వృత్తి శిక్షణ సర్టిఫికెట్లు

విజయనగరం రోటరీ క్లబ్ సెంట్రల్ నిర్వహించిన వృత్తి కోర్సుల్లో శిక్షణ పొందిన మహిళలకు రోటరీ గవర్నర్ జి. శ్రీరామ్ చేతుల మీదుగా అవార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. యువతకు ఉపాధి మార్గాలు చూపడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ప్రెసిడెంట్ జగదీష్ తెలిపారు. జేఎస్ఎస్, చలసాని గ్రూప్స్ సంయుక్తంగా 90 రోజుల పాటు ఈ శిక్షణను నిర్వహించాయి.