GDWL: దసరా సెలవుల్లో పాఠశాలలు నిర్వహిస్తే యాజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అయిజ ఎంఈఓ రాములు దయాల్ పేర్కొన్నారు. బుధవారం ఎంఆర్సీలో ప్రైవేట్ పాఠశాల యజమానులతో సమావేశం నిర్వహించారు. సెలవుల్లో పాఠశాలలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ గైడ్ ఇండెక్స్, విద్యార్థుల వివరాల నవీకరణ, తదితర పనులు పూర్తి చేసి అయిజ మండలాన్ని జిల్లాలో ముందు వరుసలో ఉంచాలన్నారు.
తెలంగాణ
సెలవుల్లో పాఠశాలల నిర్వహిస్తే కఠిన చర్యలు: MEO


