GDWL: రాజోలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు బుధవారం దుకాణదారులతో ఎస్సై కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. భద్రత, నేరాల నియంత్రణకు కెమెరాలు ఉపయోగపడతాయని తెలిపారు. కెమెరాల ఏర్పాటుకు దుకాణదారులు స్వచ్ఛందంగా విరాళాలు అందించి, సహకరించాలని ఎస్సై కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగిరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
'భద్రత, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు'


