హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా'

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని మున్సిపల్ ఛైర్మన్ బృంగి రత్నమాల అన్నారు. మున్సిపాలిటీలోని 7, 9, 10, 20, 21 వార్డులలో ఏర్పాటుచేసిన వార్డు కార్యాలయాలను బుధవారం ఆమె సందర్శించారు‌. ఈ సందర్భంగా వార్డులలో నెలకొన్న సమస్యలు, పారిశుద్ధ్యం, త్రాగునీటి సమస్య, వీధి దీపాల నిర్వహణ గురించి మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.