హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి చొరవ...నాలుగు నెలల చిన్నారి క్షేమం

కోనసీమ: రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన నాలుగు నెలల చిన్నారి రియాన్సీ గ్రేస్‌కు విజయవాడలో వైద్యులు విజయవంతంగా గుండె ఆపరేషన్ నిర్వహించారు. నిరుపేద కుటుంబం కావడంతో ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురవగా, మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవ తీసుకుని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎల్‌ఓసీ మంజూరుకు చర్యలు చేపట్టారు.