కృష్ణా: పెడన నియోజకవర్గంలోని 71 మంది నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.59.45 లక్షల సాయం మంజూరైంది. పెడన తోటమూల టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ బుధవారం చెక్కులు, ఎల్‌ఓసీలను పంపిణీ చేశారు. బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడన, గూడూరు మండలాల లబ్ధిదారులకు 55 చెక్కులు, 16 వైద్య ఎల్‌ఓసీలు అందించారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే


