హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములకనూరులో ప్రజా సమస్యలు తెలుసుకున్న మంత్రి పొన్నం

KNR: చిగురుమామిడి మండలం ములకనూరు గ్రామంలో బుధవారం ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ మేరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద రూ.40 లక్షల రుణాల చెక్కులు పంపిణీ చేశారు.