హైదరాబాద్: 28°C
క్రైమ్

కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం

ఢిల్లీలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈశాన్య ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. ఇద్దరు చిన్నారులను స్థానికులు రక్షించారు. సంఘటనా స్థలిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కాగా, నెల క్రితం ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.