హైదరాబాద్: 28°C
తెలంగాణ

"బతుకమ్మ, దసరాకు పకడ్బందీ ఏర్పాట్లు"

WGL: బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా నగరంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. భద్రకాళి, పద్మాక్షి, వేయిస్తంభాల గుడి, రంగసాయిపేట, శివనగర్‌ ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. పారిశుద్ధ్యం, ఫాగింగ్‌, వీధి దీపాలు, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.