హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి: మాజీ ఎమ్మెల్యే

NDL: బేతంచర్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలతో బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డోన్ నియోజకవర్గ అబ్జర్వర్ గోవర్ధన్‌రెడ్డి పాల్గొని పలు సూచనలు చేశారు.