హైదరాబాద్: 28°C
క్రైమ్

పరిశ్రమలో భారీ పేలుడు

AP: విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లోని బెర్రీ అల్లాయిస్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శబ్దంతో కార్మికులు భయపడి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తుండగా.. ఎమ్మెల్యే బేబి నాయన ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. 70 శాతం మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు.