హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

HNK: PMI పనుల కారణంగా బుధవారం(రేపు) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని హనుమకొండ టౌన్ DEE సాంబారెడ్డి తెలిపారు. ఉ.8 నుంచి 10 వరకు TP టెంపుల్, అమృత గార్డెన్, రాయపురవాడ,మచిలీబజార్, సుధానగర్, రఘన్నదర్వాజా ప్రాంతాల్లో, మధ్యాహ్నం 3:45 నుంచి 5:45 వరకు స్నేహనగర్, శ్రీనగర్ కాలనీ, రాఘవేంద్రనగర్, సూర్య ఆసుపత్రి పరిసరాల్లో సరఫరా నిలిపివేస్తామన్నారు.