హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

BSP మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మృతి

కోనసీమ: బహుజన సమాజ్ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కోఆర్డినేటర్ గెడ్డం సంపత్ రావు అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన.. తుదిశ్వాస విడిచారు. అమలాపురం బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా సేవలందించడంతో పాటు బీఎస్పీ నాయకుడిగా పలు సమస్యలపై ఉద్యమాలు చేపట్టారని పార్టీ కార్యకర్తలు తెలిపారు.