హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా జడ్జిని కలిసిన రవికుమార్

MBNR: మహబూబ్‌నగర్ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్‌గా నియమితులైన కె.ఎస్. రవికుమార్ బుధవారం జిల్లా జడ్జి ప్రేమలతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాల గురించి జడ్జి అడిగి తెలుసుకున్నారని రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో భారత్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.