హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయితీపై ఆరుతడి పంటల విత్తనాలు

AKP: తక్కువ వర్షపాతం నమోదైనా ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు నిండడంతో రైతులు ముదిరిన నారుమడులతో నాట్లు వేస్తున్నారని ఎలమంచిలి ఏవో మోహన్‌రావు తెలిపారు. ఎకరాకు అదనంగా 25 కేజీల యూరియా వేసుకోవాలని సూచించారు. దోమ, పొడ తెగుళ్ల నివారణకు మందులు పిచికారీ చేయాలన్నారు. రాగులు, జనుము, ఉలవలు తదితర విత్తనాలు రైతు సేవా కేంద్రాల్లో 80 శాతం రాయితీపై సరఫరా చేస్తున్నామన్నారు.