భారత క్రికెటర్ల జెర్సీ వెనుక ఉండే ఉబ్బెత్తు పరికరం కేవలం డిజైన్ కాదు, అది 'GPS పెర్ఫార్మెన్స్ ట్రాకర్'. ఆటగాళ్ల భద్రత కోసం బీసీసీఐ దీన్ని ప్రవేశపెట్టింది. మ్యాచ్‌లో ప్లేయర్స్ పరుగెత్తిన దూరం, టాప్ స్పీడ్, గుండె స్పందనలను ఇది సేకరిస్తుంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల పనిభారాన్ని అంచనా వేస్తూ.. గాయాల బారిన పడకుండా ముందే నివారించేందుకు టీమ్ మేనేజ్మెంట్ దీనిని ఉపయోగిస్తోంది.
క్రీడలు
క్రికెటర్ల జెర్సీ వెనుక ఉండే పరికరం ఏంటి..?


