హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశ్రమ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

NRML: నిర్మల్ డ్యాంగాపూర్ ఆశ్రమ ఉన్నత పాఠశాలను బుధవారం మండల ఎంఈవో విజయస్వప్న సందర్శించి తనిఖీ చేశారు. విద్యార్థుల బోధన పరిస్థితులు, ఎస్ఏ-1 పరీక్షల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని, పాఠశాల నిర్వహణపై పలు సూచనలు చేశారు.