ఆల్‌రౌండర్ నమన్ ధీర్ టీ20 డెబ్యూ మ్యాచ్‌లోనే 3 వికెట్లతో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. నమన్ తనకు దక్కిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడని కొనియాడాడు. అయితే, నమన్ రాకతో వాషింగ్టన్ సుందర్ వైట్ బాల్ కెరీర్ ముగిసిపోయినట్లేనని అభిప్రాయపడ్డాడు. ఇకపై సుందర్ టెస్టులకే పరిమితం కావాల్సి వస్తుందన్నాడు.
క్రీడలు
నమన్ ధీర్ అదరగొట్టాడు: శ్రీకాంత్


