హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'9న నరసాపురంలో ప్రత్యేక పీజీఆర్‌ఎస్'

W.G: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు అక్టోబర్ 9న ఉదయం 9.30 గంటలకు నరసాపురం ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ప్రత్యేక పీజీఆర్‌ఎస్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, డివిజన్, మండల, మున్సిపల్ స్థాయి అధికారులు పాల్గొంటారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.