హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చేయూతను అందించిన సహాద్యోగులు

విజయనగరం రూరల్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తూ ఇటీవల రహదారి ప్రమాదానికి గురై ఎస్.రమణ మరణించారు. వారి కుటుంబానికి చేయూతను అందించేందుకు జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా రూ. 1,43,800ల చెక్కును అతని భార్యకి ఎస్పీ దామోదర్ పోలీస్ కార్యాలయంలో ఇవాళ అందించారు.