NDL: సంజామల మండలంలోని వివిధ గ్రామాల్లో ఖరీఫ్ పంటలకు 75 శాతం నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారి భూమా జ్యోతి తెలిపారు. పంట నష్టాన్ని అంచనా వేసి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు పేర్కొన్నారు. సంజామల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. బీమా చేసుకున్న ప్రతి రైతుకు నిబంధనల మేరకు నష్టపరిహారం అందుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సంజామలలో ఖరీఫ్ పంటలకు 75% నష్టం


