హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ఖర్చుకు బదులు ఆసుపత్రి కడదామా?

BPT: మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జ్ అశోక్ కుమార్ వినూత్న సవాల్ విసిరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరు పార్టీలు ఖర్చు చేసే నిధులతో నియోజకవర్గ ప్రజల కోసం ఉమ్మడిగా 100 పడకల ఆసుపత్రి నిర్మిద్దామని ప్రతిపాదించారు. ఈ సవాల్‌ను మంత్రి స్వీకరిస్తారా అని ప్రశ్నించారు.