హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితా అక్రమాలపై వైసీపీ ఫిర్యాదు

సత్యసాయి: కదిరి మున్సిపల్ పరిధిలోని 44 వార్డుల ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని YCP నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. పట్టణ వైసీపీ అధ్యక్షుడు బాబ్జాన్, మాజీ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. జాబితాలోని తప్పులను తక్షణమే సరిదిద్దాలని, లేనిపక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.