హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమయానికి రాని బస్సులు.. ప్రయాణికుల అవస్థలు

NZB: నందిపేట్ ప్రయాణ ప్రాంగణంలో బస్సులు సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్‌లోకి ప్రైవేటు వాహనాలు ఇష్టానుసారంగా రావడంతో రద్దీ మరింత పెరుగుతోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సుల కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.