హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా శరన్నవరాత్రి రాట మహోత్సవం

AKP: శరన్నవరాత్రి సందర్భంగా పరవాడలో బుధవారం దుర్గాదేవి రాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యంగ్‌మెన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పైల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ చుక్కా రామునాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అమ్మవారి కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని పైల ఆకాంక్షించారు. ఈ నెల 11 నుంచి 20 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు.