హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోదీకి మంత్రి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు

అన్నమయ్య: ప్రభుత్వ నాయకత్వంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజా సేవను జీవిత ధ్యేయంగా చేసుకుని నిబద్ధత, క్రమశిక్షణతో దేశ సేవలో మోదీ ముందుకు సాగుతున్నారని కొనియాడారు. మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి, ప్రగతి దిశగా పయనిస్తోందని పేర్కొన్నారు.