హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాగ్దేవి కళాశాల విద్యార్థికి సిల్వర్ మెడల్

PLD: నరసరావుపేటకు చెందిన వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థి సంకా కౌశిక్ టర్కీలో జరిగిన ఏషియన్ ఎక్విప్డ్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్‌షిప్‌–2026లో సత్తా చాటాడు. జూనియర్ 93 కేజీల విభాగంలో 190 కేజీల బెంచ్ ప్రెస్ ఎత్తి సిల్వర్ మెడల్ సాధించాడు. అంతర్జాతీయ క్రీడాకారులతో పోటీపడి ఈ ఘనత సాధించడం విశేషం. కౌశిక్‌ను కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు అభినందించారు.