హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన

KDP: సిద్ధవటం మండలం భాకరాపేట సమీపంలో APSP 11వ బెటాలియన్లో బుధవారం 'నషా ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమం నిర్వహించారు. కమాండెంట్ కె. ఆనంద రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది,నూతన పోలీసు కానిస్టేబుళ్లతో వ్యసన రహిత భారతదేశం కోసం ప్రతిజ్ఞ చేయించారు. బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో ధ్యాన కార్యక్రమం నిర్వహించి, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.