హైదరాబాద్: 28°C
తెలంగాణ

గడువులోగా రైల్వే పనులు పూర్తి కావాలి: డీకే అరుణ

MBNR: మహబూబ్‌నగర్ ఐడీఓసీ భవనంలో ఎంపీ డీకే అరుణ ఆధ్యర్యంలో దిశ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి కేంద్ర నిధుల పథకాల పురోగతిపై చర్చించారు. మున్సిపాలిటీల్లో తాగునీరు, డ్రైనేజీ సమస్యలను తీర్చాలని అన్నారు. జాతీయ రహదారులు, రైల్వే ఆర్‌ఓబీ విస్తరణ పనులను నిర్దేశిత గడువులోగా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.