హైదరాబాద్: 28°C
తెలంగాణ

సహకార సంఘాల యూనిట్లను పరిశీలించిన కలెక్టర్

నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రం సమీపంలోని PACS ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గొర్రెల పెంపకం యూనిట్, వనపట్ల శివారులో నిర్మిస్తున్న పెట్రోల్ బంక్, తెలకపల్లి మండలం చిన్నముద్దునూరులోని గానుగ నూనె ఉత్పత్తి కేంద్రాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ బుధవారం పరిశీలించారు. గొర్రెల ఆరోగ్యం, దాణా, బరువు పెరుగుదల, టీకాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.