హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యావరణ చర్యలపై సంతృప్తి

KRNL: తుగ్గలి మండలం పగిడిరాయి–జొన్నగిరి సమీపంలోని స్వర్ణగిరి గోల్డ్ మైన్స్‌ను బుధవారం ఏపీపీసీబీ చైర్మన్ పి.కృష్ణయ్య సందర్శించారు. ప్లాంట్‌లో పర్యావరణ, నీటి, వ్యర్థాల నిర్వహణ చర్యలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 30 ఎకరాల గ్రీన్‌బెల్ట్‌లో 33,372 మొక్కలు నాటడాన్ని అభినందించారు. పర్యావరణ ప్రమాణాలను కొనసాగిస్తూ మరింత పచ్చదనం పెంచాలని సూచించారు.