హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లె పండుగతో గ్రామాల రూపురేఖల్లో మార్పు: ఎమ్మెల్యే

కోనసీమ: పల్లె పండుగతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. వాడపాలెంలో రూ.1.53 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో కొత్తపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.