ASR: జీకేవీధి మండలం దారకొండ పీహెచ్‌సీ అంబులెన్స్ 10-15 రోజులుగా రిపేర్‌లో ఉండటంతో అత్యవసర వైద్య సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గర్భిణీలు, రోగులను తరలించేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన చెందారు. అంబులెన్స్‌ను వెంటనే రిపేర్ చేసి, మరో కొత్త అంబులెన్స్‌ను ఏర్పాటుచేయాలని గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు కోరారు.
ఆంధ్రప్రదేశ్
'అంబులెన్స్‌ను వెంటనే రిపేర్ చేయాలి'


