హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒంగోలులో BSNL ఆఫీస్ వద్ద పెన్షనర్ల నిరసన

ప్రకాశం: ఒంగోలులోనే BSNL ఆఫీస్ వద్ద ఆల్ ఇండియా పెన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. మెడికల్ అలయన్స్ గతంలో రూ.1000 ఇచ్చేవారని ఇప్పుడు దాన్నే తొలగించారని, వెంటనే యధావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరుతూ వారు ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.