హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నగార్లపాడులో కార్డాన్‌ సెర్చ్‌!

PLD: కారంపూడి మండలం చిన్నగార్లపాడు గ్రామంలో పోలీసులు బుధవారం విస్తృత కార్డాన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జగదీష్‌ ఆదేశాల మేరకు సీఐ భాస్కర్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. గ్రామంలోని ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల యాజమాన్య, పత్రాల వివరాలను పరిశీలిస్తున్నారు