SKLM: ఆమదాలవలస మండలం కలివరం గ్రామంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. గ్రామంలోని వరి పంట పొలాలను పరిశీలించి పంట పరిస్థితి, సాగునీటి లభ్యత, వ్యవసాయ పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం ఈ-క్రాప్ బుకింగ్ ప్రక్రియతో పాటు సంబంధిత రికార్డులను పరిశీలించారు. తహశీల్దార్ బి.సత్యం, ఏవో మెట్ట మోహనరావు, మండల సర్వేయర్ బి.గోపి, ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
వరి పంట పొలాలను పరిశీలించిన జేసీ


