AKP: రోలుగుంటలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల్లో వర్మీ కంపోస్ట్ విధానంపై గురువారం శిక్షణ నిర్వహించనున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వరరావుతో పాటు 24 పంచాయతీల పీడీవోలు, క్లాప్ మిత్రలు పాల్గొంటారన్నారు. ఎరువుల తయారీ ప్రాసెస్, మెళకువలపై పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చెత్త నుంచి సంపద తయారీపై రేపు ప్రత్యేక శిక్షణ


