హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్తనపల్లి 25వ వార్డులో డాక్టర్ గజ్జల పర్యటన

PLD: సత్తెనపల్లి 25వ వార్డులో వైసీపీ నేత సుధీర్ భార్గవ రెడ్డి పర్యటించారు. ముందుగా ఆంజనేయస్వామిని దర్శించుకుని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వార్డులో ప్రజలు, కార్యకర్తల సమస్యలను తెలుసుకుని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 25వ వార్డులో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.