హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దు'

కృష్ణా: అక్రమాలను చూసీ చూడనట్లు వ్యవహరించి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దని అధికారులను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. బుధవారం అవనిగడ్డ మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ అధికారుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా అరికట్టమని సీఎం, డిప్యూటీ సీఎం పదేపదే చెబుతుంటే, అధికారులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు.