SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన ఆశా కార్యకర్తలు ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (NER)ను క్యాంపు కార్యాలయంలో కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందించారు. కనీస వేతనాలు చెల్లించి పర్మినెంట్ చేయాలని, వారాంతపు సెలవులు, జాతీయ, పండుగ సెలవులు అమలు చేయాలని వారు కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేని కల్సిన ఆశా వర్కర్లు


