హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంకటపాలెంలో రాజముద్ర పాస్‌ పుస్తకాల పంపిణీ

బాపట్ల మండలం కంకటపాలెంలో రీ-సర్వే పూర్తయిన సందర్భంగా రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అందజేశారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి, భూములకు పూర్తి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ పాస్‌పుస్తకాలతో రైతులకు భద్రత చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో,ఎమ్మార్వో పాల్గొన్నారు.