హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుపాకీ మిస్‌ఫైర్‌.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

VSP: విశాఖలోని ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌‌ సింగ్ భద్రతా విధుల్లో ఉన్న ఏఆర్‌ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తూ మిస్‌‌ఫైర్ అయింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ అప్పలకొండ ఛాతీ భాగంలో తీవ్ర గాయమవ్వగా, అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.