KRNL: కోసిగి సిద్ధప్పపాలెం కాలనీలోని డ్రైనేజీ కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. మురుగునీరు సాఫీగా సాగక తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దోమలు స్వైరవిహారం చేస్తుండటంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులు స్పందించి కాలువల్లోని చెత్తను తొలగించి బ్లీచింగ్ చల్లాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
డ్రైనేజీలో చెత్త.. దుర్వాసనతో అవస్థలు


