W.G: పెనుమంట్ర మండలం వెలగలేరు HP పెట్రోల్ బంక్ వద్ద వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పి కంకర గుట్టపైకి దూసుకెళ్లిన ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో జి.అనిల్ కుమార్(17), జె.సువర్ణ రత్నం (19) తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు 108 వాహనంలో వారిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
బైక్ బోల్తా.. విద్యార్థులకు తీవ్ర గాయాలు


